భారత్ చేతిలో పాక్ చిత్తు 

భారత్ చేతిలో పాక్ చిత్తు 

పాకిస్తాన్‌పై భారత్‌ మరోసారి పైచేయి సాధించింది. ఈసారి కబడ్డీలో దాయాది దేశాన్ని మట్టికరిపించింది. కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ను చిత్తు చేసింది. అజయ్ ఠాకూర్ సారథ్యంలోని భారత్ జట్టు.. 36-20 తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. మొదటి సెషన్ ముగిసేసరికి 22-9 పాయింట్లతో ఉన్న భారత్.. రెండో సెషన్‌లోనూ ఆ దూకుడును కొనసాగించింది. మ్యాచ్ ముగిసే సమయానికి 36-20 పాయింట్లతో ఆధిక్యంలో నిలవడంతో టోర్నీలో తొలి విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. 9 రోజులపాటు సాగే ఈ టోర్నీలో ఆరు జట్లు రెండు గ్రూప్‌ల్లో పోటీ పడుతున్నాయి. పాక్‌, కెన్యాలతో కలిసి భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది. గ్రూప్‌- బిలో ఇరాన్‌, కొరియా, అర్జెంటీనా జట్లు ఉన్నాయి.