పాక్‌పై భారత్‌ విజయం..

పాక్‌పై భారత్‌ విజయం..

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇవాళ జరిగినే కాంస్య పోరులో పాకిస్తాన్‌ను 2-1తో మట్టికరిపించింది. భారత్‌ జట్టు 3వ, 50వ నిమిషంలో గోల్స్ చేసి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. 52వ నిమిషంలో పాక్‌ గోల్‌ సాధించడంతో స్కోరు 2-1కు చేరింది. అనంతరం ఇరు జట్లు గోల్స్‌ చేయకపోవడంతో భారత్‌ విజయం ఖాయమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు  కాంస్యమే లభించింది. ఇవాళ భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలు లభించాయి.