భారీ టార్గెట్‌ బలాదూర్... టీమిండియా గ్రాండ్ విక్టరీ

భారీ టార్గెట్‌ బలాదూర్... టీమిండియా గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగిన తొలి టీ-20 మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత జట్టు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ... అయితే.. విండీస్ బ్యాట్స్‌మన్స్.. భారత బౌలర్లలపై విరుచుకుపడుతూ భారీ స్కోర్ సాధించారు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి.. టీమిండియా ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ 94 పరుగులతో చెలరేగి పోయాడు... మరోవైపు అర్ధసెంచరీతో కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 18.4 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి విజయం సాధించింది కోహ్లీసేన. దీంతో మూడు టీ-20ల సిరీస్‌లో శుభారంభం చేసి.. 1-0 ఆధిక్యం సాధించింది భారత్.