తొలి పోరులో విజయం సాధించిన భారత్...

తొలి పోరులో విజయం సాధించిన భారత్...

ఐపీఎల్ తర్వాత ఆసీస్ పర్యటన కు వెళ్లిన భారత్ వారితో ఆడిన వన్డే సిరీస్ ను కోల్పోయింది.  అయితే ఈరోజు ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ జరిగింది. అందులో 11 పరుగుల తేడా తో విజయం సాధించిన భారత్ సిరీస్ లో 0-1 తో ఆధిక్యం లోకి వెళ్ళింది. భారత్ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగ్గిన ఆసీస్ కు మంచి ఆరంభమే లభించింది. కానీ ఆ తర్వాత వచ్చిన వారిని భారత బౌలర్లు చాహల్, నటరాజన్ వరుసగా పెవిలియన్ కు పంపించడంతో జట్టు నిర్ణిత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్ లో చాహల్, నటరాజన్ మూడేసి వికెట్లు తీసుకోగా చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు.       

అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అందులో రాహుల్ (51) అర్ధశతకంతో రాణించగా జడేజా (44), సంజూ సాంసన్ (23) అతనికి తోడుగా నిలిచారు. ఇరాక్ ఈ రెండు జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్ ఈ నెల  6న జరగనుంది.