విశాఖ టెస్టులో ఇండియా భారీ విజయం 

విశాఖ టెస్టులో ఇండియా భారీ విజయం 

విశాఖ వేదికగా ఇండియా.. దక్షిణాఫ్రికా జట్లమధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సినిమా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన ఇండియా.. రెండో ఇన్నింగ్స్ లోను అదే దూకుడును ప్రదర్శించి భారీ స్కోర్ సాధించింది.  414  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కేవలం 191 పరుగులకే చేతులెత్తేశారు.  

రవీంద్ర జడేజా 87 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీ 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకొని విజయం కీలక పాత్ర పోషించాడు.  ఇక ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ మొదటి, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి మెప్పించారు.