ఇండియా బుల్స్‌లో ఎంబసీ వాటా

ఇండియా బుల్స్‌లో ఎంబసీ వాటా

ధనలక్ష్మీ బ్యాంక్‌ టేకోవర్‌కు రెడీ అయిన ఇండియా బుల్స్‌ గ్రూప్‌ ఇతర కీలక ఆస్తుల అమ్మకానికి రెడీ అయింది. బ్యాంక్‌ టేకోవర్‌కు ఆర్బీఐ నుంచి అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు వీలుగా రియల్‌ఎస్టేట్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌లో తనకున్న 28 శాతవాటాను విక్రయించాలని కంపెనీ ప్రమోటర్‌ సమీర్‌ నిర్ణయించారు. ఈ వాటాను బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌కు విక్రయించారు. ఈ డీల్‌ విలువ రూ. 2,700 కోట్లని తెలుస్తోంది. దీంతో ధనలక్ష్మీ బ్యాంక్‌ టేకోవర్‌కు ఇండియా బుల్స్‌కు అవరోధాలు లేనట్లే. ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వ్యాల్యూయేషన్‌ రూ. 7000  కోట్లుగా నిర్ణయించారు. ఈ కంపెనీ వద్ద ప్రస్తుతం 2.35 కోట్ల చదరపు అడుగుల రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు, 24 లక్షల కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ ప్రాపర్టీలు ఉన్నాయి. బుధవారం తాము ఇండియాబుల్స్‌తో చర్చలు మొదలు పెట్టామని, గురువారం డీల్‌ కుదుర్చుకున్నామని ఎంబసీ గ్రూప్‌ పేర్కొంది. ఈ డీల్‌కు అవసరమైన నిధులను అంతర్గతంగా సర్దుబాటు చేస్తామని ఎంబసీ పేర్కొంది.