భారత సరిహద్దుల్లో మళ్ళీ కలకలం... 

భారత సరిహద్దుల్లో మళ్ళీ కలకలం... 

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షిణించిపోయాయి.  పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో దాదాపుగా 300 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని వార్తలు వస్తున్నాయి.  వారికోసం ఆర్మీ, పోలీసులు గాలిస్తున్నారు. అంతేకాదు, పీవోకేను దాటి ఇండియాలోకి ప్రవేశించేందుకు దాదాపు 500 మంది ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది.  వారిని ఇండియాలోకి రానివ్వకుండా సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.  

పఠాన్ కోట్ లో మళ్ళీ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెంట్ వర్గాల నుంచి సమాచారం అందటంతో ఇండియా అప్రమత్తం అయ్యింది.  భద్రతను మరింత కట్టుద్దిటం చేసింది.