'రహస్య పాదముద్రలు' కనుగొన్న భారత సైన్యం, అవి 'యతి'వేనా?

'రహస్య పాదముద్రలు' కనుగొన్న భారత సైన్యం, అవి 'యతి'వేనా?

భారత సైన్యం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ప్రకటన చేసింది. పర్వతారోహణ యాత్రలో తాము 'రహస్య పాదముద్రలు' కనుగొన్నామని తెలిపింది. అవి పౌరాణిక మృగం 'యతి'వే తప్ప మరొకటి కాదని అంటోంది. సైన్యానికి చెందిన సమాచార విభాగం తన ట్వీట్ లో మంచులో ఒక గీత మాదిరిగా వరుసలో ఉన్న పాదముద్రల ఒక ఫోటోగ్రాఫ్ పెట్టింది.

యతిగా పిలిచే అసహ్యకరంగా కనిపించే మంచు మనిషి కచ్చితంగా భారత సైన్యం కల్పనలో నుంచి ఊడిపడిన కట్టుకథ మాత్రం కాదు. తరతరాలుగా హిమాలయాల్లోని ప్రముఖ జానపద గాథల్లో అవిభాజ్యంగా ఉంటూ వచ్చింది యతి. పర్వతారోహకులు, క్యాంప్ వేసినవారు, జంతువులను ఈ జంతువు బెదరగొట్టిన కథలు కోకొల్లలుగా ఉన్నాయి. చాలా మంది తమ జీవితంలో అనేక ఏళ్లు ఈ జీవి ఏంటో, అదెక్కడ ఉంటుందో అనే అన్వేషణలోనే గడిపేశారు. 

అయితే ఎంతో కాలం తర్వాత ఈ రహస్య జంతువు పాదముద్రలను కనిపెట్టామంటున్న భారత సైన్యం మాటలు నమ్మొచ్చా? అంటే గుడ్డిగా నమ్మేయలేమనే చెప్పాలి. 2017 చివరలో ప్రొసీడింగ్స్ ఆఫ్ ద రాయల్ సొసైటీ బి లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం యతిగా చెబుతున్న జంతువు నిజానికి గోధుమ ఎలుగుబంటి కావచ్చనే చెప్పింది. ఇప్పటి వరకు యతిపై వచ్చిన అనేక విశ్లేషణలలో ఇదొక్కటే కాస్త దగ్గరగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. నేపాల్ లోని అప్పర్ ముస్టాంగ్ ప్రాంతంలో నివసించే ప్రజల నుంచి, ప్రముఖ పర్వతారోహకుడు రీనోల్డ్ మెస్నర్, ఇతర మ్యూజియంల నుంచి సేకరించిన నమూనాలు ఆధారంగా చూస్తే యతి రెండు ఎలుగుబంటి జాతులకు చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. అవి హిమాలయన్ బ్రౌన్ బేర్, టిబెటన్ బ్రౌన్ బేర్. చేయి చూస్తే ఆసియా నల్ల ఎలుగుబంటిలా ఉంది. నాజీ ట్రోఫీలో ఉన్న పన్ను ఒక్కటి మాత్రమే ఏ ఎలుగుబంటికి చెందదు. అది ఒక కుక్కది అని తేల్చారు.

ప్రస్తుతానికైతే భారత సైనిక సిబ్బంది ఎక్కడ ఈ పాదముద్రలను గుర్తించారో తెలియదు. అయితే ఈ జీవి ఏంటో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నో పరిశోధనలను పక్కనపెట్టి భారత సైన్యం ఒక మూలం నుంచి అని మాత్రమే చెప్పడం విచిత్రంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తపై చాలా మంది ట్విట్టర్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.