పీవోకే ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డ ఇండియన్ ఆర్మీ..

పీవోకే ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డ ఇండియన్ ఆర్మీ..

గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ తన సైన్యం సహాయంతో ఉగ్రవాదులను కాశ్మీర్ లోకి పంపేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.  ఉగ్రవాదులను ఇండియాలోకి పంపే క్రమంలో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. ఇండియా పోస్ట్ లపై కాల్పులు జరుపుతున్నది.  

ఈ ఉదయం కూడా ఎలాంటి హెచ్చరికలు లేకుండా  ఆదివారం ఉదయం పాక్ సైన్యం కాల్పులు జరిపింది.   తంగ్ధార్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో ఇండియా ప్రతీకార దాడులకు సిద్ధం అయ్యింది.  పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులు చేపట్టింది. తంగ్ధార్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్‌ బలగాలు ఆర్టలరి గన్స్  విరుచుకుపడ్డాయి.ఈ ఘటనలో నలుగురైదుగురు పాక్‌ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.