పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చిన భారత ఆర్మీ

పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చిన భారత ఆర్మీ

కుప్వారా: భారత ఆర్మీ మరోమారు పాకిస్తాన్ డ్రోన్‌ను కూల్చింది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఎదో కనబడటంతో అనుమానించిన ఆర్మీ వెంటనే స్పందించింది. తీరా చూస్తే అది పాకీస్తాన్‌కు సంబంధించిన డ్రోన్‌గా గుర్తించి కూల్చి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జమ్మూ-కాశ్మీర్‌లోని కుప్వారా డిస్ట్రిక్ట్ వద్ద చోటుచేసుకుంది. భారత ఆర్మీ రికార్డుల ప్రకారం డ్రోన్‌ను ఉదయం 8 గంటల సమయంలో కూల్చినట్లు తెలిపారు. అయితే డ్రోన్‌ చైనా కంపెనీ డీజేఐ తయారుచేసిందనీ, దాని పేరు మావిక్-2 ప్రో అని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను, పాకిస్తాన్ చర్యలను అడ్డుకునేందుకు భారత ఆర్మీ ఎప్పుడూ సిద్దంగా ఉందని చెప్పారు. అయితే పాకిస్తాన్ తన కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టేందుకు ప్రయత్నింస్తుందని, కానీ వాటిని భారత ఆర్మ అడ్డుకోవడంలో విజవంతం అయ్యిందని పేర్కొన్నారు. అంతేకాకుండా చలికాలం ఈ ప్రదేశంలో మంచు ఎక్కువగా కురుస్తుందని, అందుకే పాకిస్తాన్ తన ఉగ్రవాద ట్రూప్‌లను ఇటు చేర్చేందుకు త్వరపడుతుందని చెప్పారు.