4వ టెస్ట్ : రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

4వ టెస్ట్ : రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు నాల్గవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టును భారత యువ పేసర్లు వణికిస్తున్నారు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చగా 9వ ఓవర్లో మరో ఓపెనర్ మార్కస్ హారిస్ ను శార్దుల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దాంతో ప్రస్తుతం ఆతిధ్య జట్టు 39 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియాలో అనుభవం ఉన్న ఒక్క బౌలర్ కూడా లేడు. భారత బౌలర్లు అందరూ కలిసి ఇప్పటివరకు ఆడినవి 4 మ్యాచ్ లే కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఆసీస్ ఆటగాళ్లు మార్నస్ లాబుస్చాగ్నే(8), స్టీవ్ స్మిత్(15) తో బ్యాటింగ్ చేస్తున్నారు.