కోహ్లీ ఎక్కడ ఓటు వేస్తున్నాడో తెలుసా..?

కోహ్లీ ఎక్కడ ఓటు వేస్తున్నాడో తెలుసా..?

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈసారి హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓటు వేయబోతున్నాడు. మే 12వ తేదీన ఓటు వేయబోతున్నానని ఆయనే స్వయంగా ప్రకటించాడు. ఈమేరకు తన ఓటరు కార్డును కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న కోహ్లీ.. తొలుత అక్కడే ఓటు వేయాలని భావించినా నిర్ణీత గడువు ముగిసేలోగా ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేయకపోవడంతో ఓటు వేసే అవకాశం కోల్పోయాడని వార్తొచ్చాయి. ఐతే.. ఓటు వేస్తున్నట్టు కోహ్లీయే స్వయంగా ప్రకటించడంతో ఆ వార్తలు నిరాధారమని తేలాయి. 
ఇక.. మే 12వ తేదీన హర్యానా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.