అందాల ప్రదర్శన అదుర్స్

అందాల ప్రదర్శన అదుర్స్

అంతర్జాతీయ స్థాయిలో జరిగే చలన చిత్రోత్సవ వేడుకల్లో నటీమణులు వెరైటీ డ్రెస్ లతో, మత్తెక్కించే డిజైనర్ వేర్ తో అదరగొడుతుంటారు.  నటీమణుల అందాలకు కేన్స్ చిత్రోత్సవం కేరాఫ్ అడ్రెస్స్ గా మారింది.  ఇందులో డిజైనర్ వేర్ డ్రెస్ లతో నువ్వానేనా అన్నట్టుగా అందాలను ప్రదర్శించారు.  ఈ కేన్స్ చిత్రోత్సవంలో ఇండియా నుంచి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్, హీరోయిన్లు దీపికా పదుకొనె, గ్లామర్ క్వీన్ కంగనా రనౌత్, అమెరికా కోడలు ప్రియాంక చోప్రాలు హాజరయ్యారు.  వేడుకల్లో రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేశారు.  

దీపికా పదుకొనె డ్రెస్సింగ్ స్టయిల్ సూపర్ గా ఉంది.  వెయిట్ కలర్ లాంగ్ డ్రెస్ తో అదరగొట్టింది.  డార్క్ బ్రౌన్ కలర్ టాప్ తో మెరుపులు మెరిపించింది.  టాప్ టు బాటమ్ అంతర్జాతీయ లుక్ ను తీసుకొచ్చింది.  చూస్తుంటే ఆకాశంలోని మేఘాలు గుర్రాల్లా మారి నేలకు దిగివచ్చాయి అన్నట్టు ఉంది.  ఇదిలా ఉంటె రెబల్ హీరోయిన్, క్వీన్ కంగనా రనౌత్ బ్లాక్ అండ్ బ్లాక్ లో అదరగొట్టింది.  అంతర్జాతీయ వేడుకలు కావడంతో అందాలను మరింతగా ప్రదర్శించేందుకు ఏ మాత్రం వెనకాడలేదు కంగనా.