హీరోయిన్ తో రవిశాస్త్రి సహజీవనం?

హీరోయిన్ తో రవిశాస్త్రి సహజీవనం?


టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి రెండవ పెళ్లి చేసుకోబోతున్నారా అంటే? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కోచ్‌ రవిశాస్త్రి బాలీవుడ్‌ హీరోయిన్ నిమ్రత్‌ కౌర్‌తో గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. 2015లో జర్మనీకి చెందిన ఓ కార్ల కంపెనీ బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్‌ కౌర్‌, రవిశాస్త్రిలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించింది. అప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారిందట. ఇక అప్పటినుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఇద్దరి మధ్య 20 ఏళ్లు వయసు వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రికి 56 ఏళ్లు కాగా.. నిమ్రత్‌కు 36 ఏళ్లు.

నిమ్రత్‌ కౌర్‌ హిందీలో ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘ది లంచ్‌ బాక్స్‌’లాంటి సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించింది. ఇక రవిశాస్త్రి టీమిండియా కోచ్‌ గా ఉన్న విషయం తెలిసిందే.  రవిశాస్త్రి 80 మధ్యలో బాలీవుడ్‌ హీరోయిన్ అమ్రితా సింగ్ తో కూడా ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. రవిశాస్త్రికి 1990లో రీతూ సింగ్‌తో వివాహమైంది. గత పది సంవత్సరాలుగా వీరు విడిగా ఉంటున్నారు. వీరికి అలేఖా అనే కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం వస్తున్న వార్తలపై రవిశాస్త్రి, నిమ్రత్‌ లలో ఎవరో ఒకరు స్పందిస్తే అసలు విషయం తెలుస్తుంది.