5 నెలలు ఫ్యామిలీకి దూరంగా టీం ఇండియా... 

5 నెలలు ఫ్యామిలీకి దూరంగా టీం ఇండియా... 

కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలు ఇంట్లోనే ఉన్న భారత క్రికెటర్లు ఇప్పుడు చాలా బిజీ గా మారనున్నారు. వారు వచ్చే నెల 19 నుండి జరగనున్న ఐపీఎల్ 2020 లో ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత భారత జట్టుకు ఆస్ట్రేలియా టూర్ ఉంది. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ కోసం భారత్ నుండి బయలుదేరనున్న క్రికెటర్లు ఆ తర్వాత అక్కడి నుండి ఆసీస్ పర్యటనకు వెళ్తారు.ఆ తర్వాత మళ్ళీ జనవరి మూడో  వారంలోనే భారత గడ్డ పై అడుగుపెడతారు. దాంతో ఆటగాళ్లు 5 నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే యూఏఈ లో జరిగే ఐపీఎల్ కు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలా.. వద్ద అనే విషయాన్ని బీసీసీఐ ఫ్రాంఛైజీలకే వదిలేసింది. ఈ నేపధ్యం లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ ఆటగాళ్ల కుటుంబ సభ్యులను యూఏఈ కి అనుమతించడం లేదు అలాగే జట్టు సహాయక సిబ్బందిని కూడా యూఏఈ కి తీసుకెళ్లడం లేదని తెలిపింది. సిఎస్కే నిర్ణయంతోనే మిగితా జట్లు కూడా వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక నవంబర్ 10 న ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆసీస్  పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అక్కడ 14 రోజుల క్వారంటైన్ తర్వాత డిసెంబర్ 3 న భారత్-ఆసీస్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.