ఘనంగా క్రికెటర్ హనుమ విహారి వివాహం

ఘనంగా క్రికెటర్ హనుమ విహారి వివాహం

టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారీ ఓ ఇంటివాడయ్యాడు. వరంగల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్‌తో హనుమ విహారి వివాహం వైభవంగా జరిగింది. హంటర్‌ రోడ్డులోని కోడెం కన్వెన్షన్‌ హాలులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, జిల్లాకు చెందిన పలు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. కాగా 20వ తేదీన వీరి రిసెస్షన్ జరుగనుంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన ప్రీతిరాజ్‌ను తొలిసారిగా కలుసుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆదివారం జరిగిన వివాహంతో వీరు ఒక్కటయ్యారు.