కొరియన్ సినిమాలే రీమేక్ ఎందుకు..!!

కొరియన్ సినిమాలే  రీమేక్ ఎందుకు..!!

రీమేక్.. ఈ పదం సినిమా ఇండస్ట్రీకి సుపరిచితం.  ఒక సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్టైన సినిమాల రైట్స్ ను తీసుకొని వివిధ భాషల్లో రీమేక్ చేస్తుంటారు.  ఇలా రీమేక్ చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  రీమేక్ సినిమాలు చేయడం వలన చాలా లాభాలున్నాయి.  కథ కోసం వెతుక్కునే పని ఉండదు.  ఖర్చు తక్కువ.  మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది.  

గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్టైన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.  అయితే, కొంతమంది దర్శక నిర్మాతలు కొరియన్ సినిమాలను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.  దానికి చాలా కారణాలు ఉన్నాయి.  జపాన్ నుంచి కొరియా విడిపోయాక ఉభయ కొరియాలు కలిసే ఉండేవి.  అయితే, కొన్ని కారణాల వలన ఉత్తర, దక్షిణ కొరియాలుగా విడిపోయాయి.  ఆ సమయంలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దక్షిణ కొరియా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అన్ని ఇండస్ట్రీలతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా అభివృద్ధి చేసింది.  

దక్షిణ కొరియా సినిమాలు బలమైన నేపధ్యం కలిగిన కథనాలతో తెరకెక్కుతుంటాయి.  అందుకే కొరియన్ సినిమాలవైపు ఎక్కువ దృష్టి సారిస్తుంటారు.  మిస్ గ్రానీ సినిమాను తెలుగులో సమంత హీరోయిన్ గా ఓ బేబీగా వచ్చింది.  అలానే ఒడే టు మై ఫాదర్ సినిమాను బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ భారత్ గా రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి.  దీంతో ఇప్పుడు అందరు కొరియా సినిమాలవైపు చూస్తున్నారు.