తొమ్మిది సిరంజీలతో జేసీబీ మెషీన్ తయార్

తొమ్మిది సిరంజీలతో జేసీబీ మెషీన్ తయార్

ఇంజెక్షన్ సూది చూశారా? ఇంజెక్షన్ సూది అనగానే అందరికీ అంతో ఇంతో భయం వేస్తుంది. కొందరైతే ఎంతో భయపడి పోతారు. నొప్పి సంగతి ఎలా ఉన్న దాని ఆకారం చూస్తే అమ్మో అనిపిస్తుంది. శరీరంలోకి మొత్తం చొప్పించేస్తారేమోనని వణుకు పుడుతుంది. సూది మొన చిన్నగా ఉన్నా ఆ భయం మాటల్లో చెప్పలేం. 

కానీ మన దేశంలోని గ్రామాల్లో ఉండే పిల్లలు, కుర్రాళ్లు మామూలోళ్లు కారు. వాళ్లు బుర్రకు పదును పెడితే మహామహులు సైతం సాహో అనాల్సిందే. పాత బ్యాటరీలతో సబ్ స్టేషన్ చేస్తారు. జర్దా డబ్బాలతో పందికొక్కుల్ని చంపే బాంబులు రూపొందిస్తారు. సైకిల్ రిమ్ తో యాంటెన్నా తయారుచేసి చూపిస్తారు. 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ పిల్లాడు తొమ్మిదంటే తొమ్మిదే ఇంజెక్షన్ సిరంజీలతో చక్కగా పనిచేసే బుల్డోజర్ రూపొందించాడు. ఏ ఊరు, ఏ ప్రాంతం అనే విషయాలు తెలియవు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాడు. ఆ సిరంజీల జేసీబీని మీరు ఓ సారి చూడండి.