నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

నిలకడగా ప్రారంభమైన నిఫ్టి

నష్టాలతో ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి గ్రీన్‌లోకి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో మన మార్కెట్లు డైలమాలో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డౌ నిస్తేజంగా ముగిసినా... నాస్‌డాక్‌ భారీ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి జపాన్‌ నిక్కీ, హాంగ్‌సెంగ్‌లు గ్రీన్‌లో ఉన్నా చైనా సూచీలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి 10,800 వద్ద  తడబడుతోంది. వారం రోజుల నుంచి ఫార్మా షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఇవాళ కూడా డాక్టర్‌ రెడ్డీస్‌ల్యాబ్‌ రెండున్నర శాతంపైగా లాభపడింది. లుపిన్‌, సన్‌ ఫార్మా కూడా లాభాల్లో ఉన్నాయి. ఐటీ షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది.  టాప్‌ లూజర్స్‌లో గ్రాసిమ్‌ ఉంది. హెచ్‌పీసీఎల్‌, పవర్‌ గ్రిడ్‌, హిందాల్కో నష్టాల్లో ఉన్నా... నామమాత్రమే. బీఎస్‌ఈలో రెడింగ్టన్‌ హవా కొనసాగుతోంది. ఇవాళ కూడా ఈ షేర్‌ ఆరు శాతం పెరిగింది. ప్రిస్టేట్‌, సుందరం ఫాజనర్స్‌ కూడా అయిదు శాతం పెరిగాయి.