భారీ న‌ష్టాల‌తో ప్రారంభమైన మార్కెట్లు

భారీ న‌ష్టాల‌తో ప్రారంభమైన మార్కెట్లు

అమెరికా, చైనాల మ‌ధ్య వాణిజ్య యుద్ధం స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు అనుగుణంగా మ‌న మార్కెట్లు కూడా భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్ల‌లో అమ్మ‌కాల వెల్లువెత్తాయి. చైనా మార్కెట్లు 5 నుంచి 6 శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతున్నాయి. హాంగ్‌సెంగ్ కూడా 5 శాతం వ‌ర‌కు నష్ట‌పోయింది. క్రూడ్ ఆయిల్  ధ‌ర‌లు భారీగా క్షీణించ‌డంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు లాభాల‌తో ఉన్నాయి. అలాగే ఆక‌ర్ష‌ణీయ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన ఫెడ‌ర‌ల్ బ్యాంక్ వంటి షేర్లు వెలుగులో ఉన్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 100 పాయింట్లు న‌ష్ట‌పోయి 11,605 పాయింట్ల వ‌ద్ద ప్రారంభ‌మైంది. దాదాపు చాలా వ‌ర‌కు కౌంట‌ర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. నిఫ్టి ప్ర‌స్తుతం 94 పాయింట్ల న‌ష్టంతో 11618 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో లాభాల‌తో ట్రేడ‌వుతున్న షేర్ల‌లో బీపీసీఎల్‌, ఐఒసీ, ప‌వ‌ర్ గ్రిడ్‌, ఐష‌ర్ మోటార్స్‌, టెక్ మ‌హీంద్రా టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. టాప్ లూజ‌ర్స్‌.... టాటా మోటార్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, ఎస్ బ్యాంక్‌.

బీఎస్ఈ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్‌.... దీప‌క్ నైట్రేట్‌, ఆర్ ప‌వ‌ర్‌, ఆర్ కామ్‌, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌,  టాటా కెమిక‌ల్స్
టాప్ లూజ‌ర్స్‌.... టాటా స్టీల్ (పీపీ), టాటా మోటార్స్‌, మ‌ద‌ర్స‌న్ సుమి, ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, టాటా మోటార్స్ డీవీఆర్