అది జైషె కమాండర్ ఫోటో కాదా? జాన్ బాన్ జోవీదా!!

అది జైషె కమాండర్ ఫోటో కాదా? జాన్ బాన్ జోవీదా!!

పుల్వామాలో ఉగ్రదాడి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతోపాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు ఉదయం మట్టుబెట్టాయి. అయితే మీడియాలో ఘాజీదిగా చెబుతున్న ఫోటో అతనిది కాదని సోషల్ మీడియా తెగ గుసగుసలు పోతోంది. అందుకు తగిన ఆధారాలను కూడా తవ్వితీసి చూపిస్తున్నారు. ఘాజీ ఫోటోని, ప్రముఖ పాప్ సింగర్ జాన్ బాన్ జోవీ ఫోటోని పక్కపక్కన పెట్టి అసలు ఫోటో బాన్ జోవీదైతే నకిలీ ఫోటో ఇదని చెబుతున్నారు.

బాన్ జోవీ ఫోటోని మార్ఫింగ్ చేసిన ఉగ్రవాది ఘాజీ ఫోటోలో పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు. అసలు ఈ యూనిఫామ్ సావో పాలో పోలీసులది. పోలీస్ యూనిఫామ్ అని ఎందుకు రూఢిగా చెప్పొచ్చంటే ఒక వైపు పోలీస్ టేజర్ ఉంది. మరోవైపు పోలీస్ బ్యాటన్ కనిపిస్తోంది. మూడోది, కీలకమైన విషయం ఏంటంటే పోలీస్ రేడియో పట్టుకున్న చేతికి స్విస్-తయారీ వాచ్ పెట్టుకున్నాడు. ఇవన్నీ నూటికి నూరుపాళ్లు జాన్ బాన్ జోవి ఫోటోలో స్పష్టంగా తెలుస్తున్నాయి. జోవీ ఫోటోలో కాస్త ఆలివ్ గ్రీన్ రంగు యూనిఫామ్ కనిపిస్తుంటే ఘాజీదిగా చెబుతున్న ఫోటోలో ఇది నేవీ బ్లూ రంగులో ఉంది.