టాప్ సినీ ప్రముఖులంతా ఒకే ఫ్రేమ్ లో ...

టాప్ సినీ ప్రముఖులంతా ఒకే ఫ్రేమ్ లో ...

ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇండియా సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేకమందిని ఆహ్వానించారు.  చాలామంది ఈ వేడుకకు హాజరుకాగా, కొంతమంది సినిమా బిజీ వలన రాలేకపోయారు.  రాలేకపోయినందుకు ఆయా సెలెబ్రిటీలు ట్విట్టర్ సారీ  చెప్తుండటం విశేషం.  కార్యక్రమానికి కరణ్ జోహార్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్, బోనీ కపూర్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తదితరులు హాజరయ్యారు.  మోడీ వేడుకకు హాజరయ్యే ముందు అందరు కలిసి ఫోటో దిగారు.  ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నది.