ఈనెల 22 నుంచి రాహుల్ విదేశీ పర్యటన

ఈనెల 22 నుంచి రాహుల్ విదేశీ పర్యటన

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈనెల 22 నుంచి జర్మనీ, లండన్‌లలో పర్యటించనున్నారు. ఐరోపా, బ్రిటన్‌లలో ఎన్‌ఆర్‌ఐలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు , విద్యార్థుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ చీఫ్‌ ఆగస్ట్‌ 22, 23 తేదీల్లో జర్మనీలో, 24, 25న లండన్‌లో పర్యటిస్తారని ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ శ్యామ్‌ పిట్రోడా ట్వీట్‌ చేశారు. పర్యటనలో భాగంగా ఆయా దేశాల్లో పలు కార్యక్రమాల్లో మేథావులు, విద్యార్ధులు, మీడియాతో రాహుల్ ముచ్చటించనున్నారు. 

జర్మనీ, లండన్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ నిర్వహించే రెండు భారీ సమ్మేళనాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు మన ముందున్న అవకాశాలపై ఈ సందర్భంగా రాహుల్‌ ఎన్‌ఆర్‌ఐలకు దిశానిర్ధేశం చేస్తారన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఉపాథి, నోట్ల రద్దు, దేశ భద్రత తదితర అంశాలపై రాహుల్‌ గాంధీ ప్రసంగాల పట్ల విదేశీయులు, భారత సంతతి ప్రజల్లో ఆసక్తి నెలకొందని శ్యామ్ పిట్రోడా చెప్పారు.