ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఇండియన్ పేసర్ గుడ్ బై

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఇండియన్ పేసర్ గుడ్ బై

ఇండియన్ వెటరన్ పేసర్ ప్రవీణ్ కుమార్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 11ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. 2007లో నాగ్‌పూర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. 2012 మార్చి 30న చివరిసారిగా సౌతాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 
2011 వరల్డ్ కప్‌లో ఆడిన భారత జట్టుకు కూడా ప్రవీణ్ ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా ప్రపంచ కప్ ఆడే అరుదైన అవకాశాన్ని రాలేదు. కెరీర్‌లో కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లే ఆడి 27 వికెట్లు తీశాడు. వన్డేల్లో మొత్తం 68 మ్యాచ్‌లాడి 77 వికెట్లు తీశాడు. అన్ని సీజన్లలో అద్భుతంగా రాణించి 90 వికెట్లతో సత్తాచాటాడు.