పాక్ అదుపులో ఉన్న ఆ పైలట్ పేరు 

పాక్ అదుపులో ఉన్న ఆ పైలట్ పేరు 

తమ‌ భూభాగంలో కూల్చేసిన విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు. ఆ పైలెట్ పేరు వర్థమాన్ అభినందన్ గా పాక్ అధికారులు వెల్లడించారు. మిగ్-21 వింగ్‌ కమాండర్‌ గా ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్‌ చెబుతోంది. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. పాక్‌ యుద్ధ విమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అభినందన్ తండ్రి కూడా వాయుసేన అధికారే.