త్వరలో రైల్వే స్టేషన్లలో బుకింగ్‌ సెంటర్లు మాయం !

త్వరలో రైల్వే స్టేషన్లలో బుకింగ్‌ సెంటర్లు మాయం !


భారత రైల్వే మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మరికొన్ని రోజుల్లో రైల్వేస్టేషన్లలో బుకింగ్‌ కౌంటర్లు కనిపించకపోవచ్చు. ఎయిర్‌ వేస్‌ తరహాలోనే టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్లకు మంగళం పాడేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించేలా చర్యలు తీసుకుంటోంది. మొదటగా ప్రైవేట్‌ రైళ్లకు ఈ కొత్తవిధానాన్ని వర్తింపజేసి ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ టిక్కెట్లు అందుబాబులోకి తేవాలని యోచిస్తోంది. ఎయిర్‌ వేస్‌ మాదిరిగానే ఎంత ముందస్తుగా బుక్‌ చేసుకుంటే అంత తక్కువ ధరలో టిక్కెట్లు లభించేలా ఏర్పాట్లు చేస్తోంది.