రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. పట్టాలెక్కనున్న 200 రైళ్లు..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. పట్టాలెక్కనున్న 200 రైళ్లు..

దేశవ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుంచి 200 రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. కరోనా కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాయి. అక్కడి పరిస్థితులకు అనుకుణంగా ప్రయాణికులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇప్పటికే 30 రాజధాని తరహాలో స్పెషల్‌ ఏసీ రైళ్లు, శ్రామిక్ రైళ్లు వలస కార్మికుల కోసం నడుస్తున్నాయి. రెండు నెలల తర్వాత ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికే మొత్తం 230 రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ వ్యవధి 30రోజుల నుంచి 120రోజులకు పెంచింది. అయితే ప్రస్తుత బుకింగ్‌, తత్కాల్‌ కోటా రోడ్‌సైడ్‌ స్టేషన్‌లకు సీట్ల కేటాయింపు వంటి ఇతర నిబంధనలు రెగ్యులర్‌ టైమ్‌ టేబుల్‌ రైళ్ల మాదిరిగానే ఉన్నాయి.