రైల్వే ఆస్తులపై డ్రోన్ నిఘా... 

రైల్వే ఆస్తులపై డ్రోన్ నిఘా... 

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటి రైల్వే.  రైల్వే వ్యవస్థలో అనేక జోన్లు ఉన్నాయి.  దేశంలో రైల్వే నెట్వర్క్ చాలా పెద్దది. ఆస్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.  రైల్వే ఆస్తులను కాపాడేందుకు నిత్యం రైల్వే పోలీసులు, ఆర్ఫీఎఫ్ పహారా కాస్తుంటారు.  ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో ఆర్పీఎఫ్ కొరత ఉన్నది.  దీంతో రైల్వే ఆస్తుల రక్షణ కోసం డ్రోన్ల సహాయం తీసుకుంటోంది.  రైల్వే స్టేషన్లు, రైల్వే  యార్డులు, రైల్వే లైన్లు, రైల్వే వర్క్ షాపుల వద్ద నిఘా కోసం ఈ డ్రోన్ లను వినియోగించబోతున్నారు.  ఇప్పటికే రైల్వేశాఖ  31.87 లక్షలతో 9 డ్రోన్ లను కొనుగోలు చేసింది.  వీటికి అదనంగా మరో 19 డ్రోన్ లను కొనుగోలు చేసేందుకు రైల్వేశాఖ సిద్ధం అవుతున్నది.  ఎక్కడైతే ఆర్ఫీఎఫ్ సిబ్బంది తక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లో డ్రోన్ సహాయంతో నిఘాను పెంచబోతున్నారు.