చాహల్ @ 50

చాహల్ @ 50

ఆసియా కప్‌ సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం సాధించింది. మొదటగా టీమిండియా బౌలర్లు చెలరేగగా, అనంతరం ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 111 నాటౌట్), శిఖర్ ధావన్(114)లు పోటీపడి పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందించారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో భారత బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన రికార్డును అందుకున్నాడు. చాహల్ వన్డేల్లో 50 వికెట్లను తీశాడు. పాక్ ఇన్నింగ్స్ 45 వ ఓవర్ లో అసిఫ్ అలీ(30) ని అవుట్ చేయడంతో వన్డేల్లో 50 వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్ కు ముందు చాహల్ 48 వికెట్లు తీసాడు. చాహల్ తన మొదటి ఓవర్ చివరి బంతి(ఇన్నింగ్స్ 7.5)కి పాక్ ఓపెనర్ ఇమామ్ ను అవుట్ చేసాడు. అనంతరం 45 వ ఓవర్ లో అసిఫ్ అలీని పెవిలియన్ పంపాడు. ఈ మ్యాచ్ లో చాహల్ (9-0-46-2) రెండు వికెట్లు తీసాడు. చాహల్ తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్లను తీసిన రెండవ భారత స్పిన్నర్ గా రికార్డు సాధించాడు. 50 వికెట్లను చాహల్ 30 మ్యాచ్ లలో తీస్తే.. కుల్దీప్ యాదవ్ 24 మ్యాచ్ లలో తీసాడు. అయితే తక్కువ మ్యాచ్ లలో 50 వికెట్లను తీసిన భారత బౌలర్లలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ గా ఏడవ బౌలర్.