క‌రోనా క‌ష్టాలు.. కారు అమ్మ‌కానికి పెట్టిన భార‌త అథ్లెట్‌

క‌రోనా క‌ష్టాలు.. కారు అమ్మ‌కానికి పెట్టిన భార‌త అథ్లెట్‌

క‌రోనా వైర‌స్‌తో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి సామాన్యులే  మాత్ర‌మే కాదు.. క్ర‌మంగా అన్ని రంగాల వారిని ఆ ఎఫెక్ట్ తాకుతోంది.. ఇప్ప‌టికే.. టీచ‌ర్లు.. కూర‌గాలు, పండ్లు అమ్మ‌డం చూశాయి.. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారు కూడా ఏదో వ్యాపారం ప్రారంభించాల్సి ప‌రిస్థితులు వ‌చ్చాయి.. చిన్న చిన్న కంపెనీలు సైతం మూత‌ప‌డ్డాయి.. బ‌డా సంస్థ‌లే జీతాల్లో కోత‌పెట్టాయి.. ఇప్పుడు  క్రీడా రంగాన్ని కూడా తాకింది క‌రోనా ఎఫెక్ట్.. క్రీడా పోటీలు రద్దు కావడంతో అథ్లెట్లను ఆర్థికంగా దెబ్బతీసింది.. ఈ నేపథ్యంలో ఖర్చుల కోసం తన లగ్జరీ కారును అమ్మకానికి పెట్టింది ప్రముఖ భారత స్ప్రింటర్ ద్యూతీచంద్. గత కొన్ని నెలలుగా ఒలింపిక్ శిక్షణ లేకుండా పోవ‌డం.. క‌రోనా క‌ష్టాల‌తో.. స్పాన్సర్లు కూడా లేకపోవడంతో చేతిలో తగినంత డబ్బు లేక ఇబ్బంది ప‌డాల్సిన ప‌రిస్థితి.. దీంతో.. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు తాను ఎంతో ప్రేమతో కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారును అమ్మాలని నిర్ణ‌యం తీసుకున్నారు ద్యూతీచంద్.. కాగా, 2018 లో బీఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్‌ను తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు. 2021 లో టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఆమె ఇప్పుడు దానిని అమ్మాలని నిర్ణ‌యానికి వ‌చ్చారు. స్పాన్సర్‌షిప్ లేకపోవడం, గత కొన్ని నెలల్లో ఏమీ సంపాద‌న‌కూడా లేక‌పోవ‌డంతో.. డబ్బు సంపాదించే ఏకైక మార్గం ఇదేనని చెబుతున్నారు ద్యూతీ చంద్.