స్థిరంగా ముగిసిన నిఫ్టి

స్థిరంగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ముగిసినా... ఉదయం ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై... నష్టాల్లో ముగిశాయి. యూరో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముడి చమురు, డాలర్‌ ఇండెక్స్‌లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ట్రేడయ్యాయి. ఉదయం స్వల్ప లాభంతో ప్రారంభమైనా... క్రమంగా క్షీణిస్తూ 10845 ప్రాంతానికి చేరుకుంది. ఉదయం గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి దాదాపు 75 పాయింట్లు క్షీణించింది. కాని మిడ్‌ సెషన్‌లో మార్కెట్‌కు మద్దతు లభించింది. సెషన్‌ క్లోజింగ్‌కు ముందు నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 10930ని తాకింది. తరవాత స్వల్పంగా తగ్గి 10905 వద్ద అంటే 15 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టిలో ఇవాళ పెద్దగా మార్పులు లేవు. లాభనష్టాలు ఒకే తీరులో ఉన్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో గెయిల్‌ రెండు శాతంపైగా లాభపడింది. తరవాతి స్థానంలో బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉన్నాయి. ఇక నష్ఠాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో సన్‌ ఫార్మా ముందుంది. ఈ షేర్‌ ఏకంగా 6.6 శాతం క్షీణించగా, ఎస్‌ బ్యాంక్‌ 3.7 శాతం తగ్గింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండున్నర శాతం, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ రెండు శాతంచొప్పున నష్టపోయాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇవాళ అయిదు శాతంపైగా లాభంతో ముగియడం విశేషం.