ఒత్తిడి వచ్చినా... లాభాల్లో ముగింపు

ఒత్తిడి వచ్చినా... లాభాల్లో ముగింపు

అధిక స్థాయిల్లో తీవ్రస్థాయి ఒత్తిడి వచ్చినా మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో మార్కెట్‌ ఇవాళ 11,665 వద్ద ప్రారంభమైంది. దాదాపు 42 పాయింట్లతో ప్రారంభమైన మార్కెట్‌ 11,644కు క్షీణించినా.. తరవాత అందిన షార్ట్‌ కవరింగ్‌తో మిడ్‌ సెషన్‌లో ఏకంగా 11,738 స్థాయికి చేరినా... అధిక స్థాయిల వద్ద వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి దాదాపు ఓపెనింగ్‌ స్థాయిలో అంటే 11,669 వద్ద ముగిసింది. బ్లూ చిప్‌ షేర్లలో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఉదయం ఆసియా భారీ లాభాల్లో క్లోజ్‌ కాగా, ఇపుడు యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. తరవాతి స్థానాన్లో హిందాల్కో, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, మారుతీ షేర్లు ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌, యూపీఎల్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐఓసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఉన్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో ఆంధ్రా బ్యాంక్‌ 16 శాతం పెరిగింది. తరువాతి స్థానంలో ఉన్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ 10 శాతం గరిష్ఠ స్థాయిలో లాభపడింది. ఇక నష్టపోయిన వాటిలో ఆర్‌ కామ్‌, ఆర్‌ఈసీ, నవభారత్‌ వెంచర్స్‌ నిలిచాయి.