లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గత మూడు రోజులుగా లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాలతో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ 91.71 పాయింట్లు లాభపడి 33,880 వద్ద.. నిఫ్టీ 23 పాయింట్ల లాభపడి 10,402 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్,హిందాల్కో తదితర షేర్లు లాభపడ్డాయి. మరో వైపు టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఐడియా సెల్యులర్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్ సర్వీసు మొదలైన సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. మధ్యాన్నం వరకు ఆ లాభాలు తగ్గిపోయాయి. పలు వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గించడం, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన ప్రకటనలు చేయడంతో ఈ రోజు చివరకు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి.