స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

స్థిరంగా ప్రారంభ‌మైన నిఫ్టి

నిఫ్టి జూన్ నెల డెరివేటివ్స్ ఇవాల్టితో ముగియ‌నుంది.  అలాగే వీక్లీ కాంట్రాక్టులు కూడా ఈరోజే ముగియనున్నాయి.  నిఫ్టి ఉద‌యం నుంచి స్థిరంగా ట్రేడ‌వుతోంది.  రాత్రి నాస్ డాక్ త‌ప్ప మిగిలిన  అమెరికా సూచీలు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి.  ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి.  మార్కెట్ జీ 20 స‌మావేశం కోసం ముఖ్యంగా చైనా, అమెరికా అధ్యక్షుల భేటీ కోసం ఎదురుచూస్తోంది.  నిఫ్టి ప్ర‌స్తుతం 30 పాయింట్ల లాభంతో ట్రేడ‌వుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, మ‌హీంద్రా అండ్  మ‌హీంద్రా, హిందుస్థాన్ లీవ‌ర్ షేర్లు టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి.  టెక్ మ‌హీంద్రా, యూపీఎల్‌, ప‌వ‌ర్ గ్రిడ్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, అదానీ పోర్ట్స్‌ టాప్ లూజ‌ ర్స్‌గా ఉన్నాయి.