స్థిరంగా ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్

స్థిరంగా ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్

అంత‌ర్జాతీయ మార్కెట్లు మిశ్ర‌మంగా ఉండ‌టం, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో మ‌న మార్కెట్‌లో కొనుగోళ్ళ‌ను సాధార‌ణ ఇన్వెస్ట‌ర్లు జంకుతున్నారు.శుక్ర‌వారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిసినా... ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్ర‌మంగా ఉన్నాయి. లాభ‌న‌ష్టాలు స్వ‌ల్పంగా ఉన్నాయి. క‌చ్చిత ట్రెండ్ లోపిస్తోంది. అమెరికా, వాణిజ్య చ‌ర్చ‌ల ఊసు లేక‌పోవ‌డంతో మార్కెట్ డైరెక్ష‌న్ లేకుండా ట్రేడ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో మ‌న మార్కెట్లు 40 పాయింట్ల లాభంతో 11700పైన ప్రారంభ‌మైనా... అమ్మ‌కాల ఒత్తిడి తీవ్రంగా ఉండ‌టంతో ముందుకు సాగ‌లేక‌పోతోంది. ప్ర‌స్తుతం 20 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ముడి చ‌మురు ధ‌ర‌లు శుక్ర‌వారం రాత్రి భారీగా పెరిగాయి. ఇవాళ బ్రెంట్ క్రూడ్ ధ‌ర 70 డాల‌ర్ల‌కు దాట‌డంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో ప‌వ‌ర్ గ్రిడ్‌, భార‌తీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, టాటా స్టీల్ లాభాల్లో టాప్‌లో ఉన్నాయి. ఇక న‌ష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్ల‌లో  బీపీసీఎల్‌, ఐఓసీ, అదానీ పోర్ట్స్‌, సిప్లా, ఎస్ బ్యాంక్ ఉన్నాయి.   ఇత‌ర షేర్ల‌లో ఎన్ఐఐటీ షేర్ ప‌ది శాతం లాభంతో ట్రేడ‌వుతోంది.ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ డీల్‌తో ద‌క్షిణాదికి చెందిన ప‌లు ప్రైవేట్ బ్యాంకులు భారీ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. సౌత్ ఇండియ‌న్ బ్యాంక్‌, ధ‌న‌ల‌క్ష్మీ బ్యాంక్ వంటి షేర్లు 5 శాతం దాకా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ షేర్ల‌లో ఇండియా బుల్స్ రియ‌ల్ ఎస్టేట్‌, టాటా స్టీల్ (పీపీ) జై కార్పొరేష‌న్‌, ఇండియా బుల్స్ లిమిటెడ్‌, ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు 5 నుంచి 10 శాతం లాభంతో ట్రేడ‌వుతున్నాయి.