లక్ష డాలర్లు తరలిస్తు పట్టుబడ్డ భారత మహిళ
నేపాల్ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారత మహిళ లక్ష డాలర్లు తరలిస్తు పోలీసులకు దొరికిపోయింది. వందన సోని అనే 44 ఏళ్ల భారత మహిళ నిబంధనలకు విరుద్దంగా ఇంత మొత్తంలో నగదును తనతో తీసుకెళ్లడంతో విమానాశ్రయ పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కేందుకు బోర్డింగ్ పాయింట్‌కు వస్తుండగా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. లక్ష డాలర్లను తన హ్యాండ్ బ్యాగ్‌లో ఎవరికీ కనిపించకుండా దాచినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 5 వేల అమెరికన్ డాలర్లను వెంట తీసుకుని వెళ్లే వీలుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)