ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం... 

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం... 

మహిళ టి 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా జట్టు వరసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది.  ఈరోజు న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఇండియా జట్టు ఉత్కంఠ భరితమైన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ విజయంతో ఇండియా జట్టు సెమిస్ కు చేరడం ఖాయంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా మహిళల జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది.  

134 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇండియా జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 33 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును మ్యాడి గ్రీన్, మార్టిన్ లు ఆదుకునే ప్రయత్నం చేశారు.  43 పరుగుల కీలక భాగస్వామ్యం తరువాత ఇద్దరు స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యారు.  ఆ తరువాత చివర్లో కెర్రీ దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది.