వీడియో వైరల్: వీడు బర్త్ డే కేక్ కోయడు.. కాల్చాడు

వీడియో వైరల్: వీడు బర్త్ డే కేక్ కోయడు.. కాల్చాడు

పుట్టినరోజు వేడుకలను ఎవరైనా కేక్ కోసి జరుపుకుంటారు. కానీ మీరు చూడబోయే వీడియోలో ఉన్న వ్యక్తి కొంచెం తేడా. అతను కత్తితో కేక్ కట్ చేయలేదు. తుపాకీతో షూట్ చేశాడు. అదీ ఒక్కసారి కాదు.. చాలా సార్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసినవారంతా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిందని భావిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం దీనిని తోసిపుచ్చారు.

సోషల్ మీడియాలో ఈ వీడియోకి వేలసంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే నలుగురు వ్యక్తులు రోడ్డుపై బర్త్ డే కేక్ తో నిల్చుని ఉన్నారు. కేక్ మీద గుజ్జర్ అని రాసి ఉంది. వాళ్లు హిందీలో మాట్లాడుతుండటం వినిపిస్తోంది. కానీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. అలాగే ఈ వీడియోలోని ఘటన మీరట్ లో జరిగిందని ఎలా చెబుతున్నారో కూడా తెలియడం లేదు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటన మీరట్ లో జరిగిందనడాన్ని తోసిపుచ్చారు.

ఈ వీడియో చిన్న వీడియోలు తయారుచేసి షేర్ చేసే టిక్ టాక్ యాప్ లో షూట్ చేసినట్టు కనిపిస్తోంది. శనివారం ట్విట్టర్ లో షేర్ చేసింది మొదలు ఈ వీడియోపై వేలాదిగా ప్రతిస్పందనలు వస్తున్నాయి.