అక్కడ అమ్మకానికి ఆక్సిజన్...కలికాలం అంటే ఇదేనేమో ?

అక్కడ అమ్మకానికి ఆక్సిజన్...కలికాలం అంటే ఇదేనేమో ?

ఢిల్లీలో వాయు కాలుష‌్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. కాలుష‌్య నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వడంలేదు. సరి బేసి లాంటి కొన్ని విధానాలను ప్రవేశ పెట్టినా అది ఏమాత్రం తగ్గడంలేదు. వాయు కలుష్యం బారి నుంచి స్వచ్చమైన గాలి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీనిని అదునుగా తీసుకొని ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఆక్సిప్యూర్ అనే బార్ గాలిని అమ్మకానికి పెట్టింది. 15నిమిషాలకు రూ.299లకు అక్సిప్యూర్ అమ్ముతున్నట్లు బార్ నిర్వహకులు పేర్కొన్నారు.

తాము వివిధ రకాల పరిమళాలలో పదిహేను నిమిషాల పాటు అదుపుచేస్తూ స్వచ్చమైన గాలిని అదిస్తున్నామని తెలిపారు. దానికి లెమన్ గ్రాస్, దాల్చిన చెక్క, పుదీనా, లావెండర్, వెనీలా, యూకలిప్టస్, బాదం, చెర్రీ గార్డెనియాస్ వంటి వివిధ రకాల పరిమళాల్లో ఆక్సిజన్ అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనిని 15 నిమిషాల పాటు ఒక మనిషి మాత్రమే పీల్చుకోగలరని వివరించారు. ఇది పీల్చుకోవడం వలన మంచి నిద్ర పడుతోందని, ఒత్తిడి దరిచేరదని చెబుతున్నారు. డిసెంబర్‌‌లో ఢిల్లీ ఎయిర్​పోర్టులో మరో బ్రాంచ్​ను ఓపెన్​ చేస్తారట.