మోది ప్రపోజల్.. పాక్ ఓకే..

మోది ప్రపోజల్.. పాక్ ఓకే..

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోది ప్రపోజల్‌కు పాకిస్థాన్ సహా పలు ఆసియా దేశాలు ఓకే చెప్పాయి. ప్రపంచ దేశాల్లో కరోనా కలకలం ఇంకా చెలరేగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మానేజ్‌మెంట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, శ్రీలంక, మాల్ దీవులు తదితర దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో కరోనా నివారణకు సంబంధించిన మోదీ చేసిన ప్రపోజల్స్‌ను పాకీస్థాన్ సహా ఇతర దేశాలు ఆమోదించాయి. ఈ మేరకు చర్చలు జరుపుతామని కూడా చెప్పాయి. అయితే కరోనాను నివారణ కోసం దేశంలోని ఆరోగ్య శాఖ కార్మికులకు ప్రత్యేక వీసాలను ఇవ్వాలని, వాటి ద్వారా వైధ్యులు అవసరమైన ప్రదేశానికి త్వరగా చేరుకోగలుగుతారని తెలిపారు. అంతేకాకుండా ఇతర దేశాల కోరిక మేరకు ఆయా దేశాలకు వెళ్లడం కూడా సులభం అవుతుందని అన్నారు. అంతేకాకుండా దీని ద్వారా ప్రపంచంలో కరోనా పరిస్థితులు ఇతర విషయాలను సులభంగా లెక్కకట్టగలుగుతామని చెప్పారు. ఇదే విధంగా ఇక ముందుకు రానున్న వైరస్‌ల నుంచి కూడా రక్షణ పొందగలుగుతామని, వాటికి సాంకేతిక సమహాయక వైధ్యాన్ని అందించగలుగుతామని తెలిపారు. వీటిని అమలు చేయాలంటే అన్ని దక్షిణ ఆసియా దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికలకు సమావేశంలో పాల్గొన్న అన్ని దేశాలు మోదీని ప్రశంసించాయి. వీటిపై తమతమ దేశాల్లోని మంత్రిత్వశాఖలతో చర్చలు జరుపుతామని తెలిపాయి.