రాయుడి బౌలింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు

రాయుడి బౌలింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడిపై ఐసీసీకి ఫిర్యాదు అందింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాయుడు రెండు ఓవర్లు బౌలింగ్‌ చేశారు. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానస్పదంగా ఉందని మ్యాచ్‌ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఐసీసీ... రాయుడు బౌలింగ్‌ను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. 14 రోజుల్లో నివేదిక అందివ్వాలని కోరింది. అప్పటి వరకు బౌలింగ్ వేయొచ్చని పేర్కొంది.