కివీస్‌ బ్యాటింగ్‌ పూర్తి.. టీమిండియా టార్గెట్‌ ఇదీ..

కివీస్‌ బ్యాటింగ్‌ పూర్తి.. టీమిండియా టార్గెట్‌ ఇదీ..

మాంచెస్టర్‌లో జరగుతున్న వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ పూర్తయింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది కివీస్‌. రాస్‌ టేలర్‌ (74; 90 బంతుల్లో 3x4, 1x6) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (67) రాణించాడు. నికోల్స్‌ (23), గ్రాండ్‌హోమ్‌(16), నీషమ్‌ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, జడేజా, పాండ్యా, చాహల్‌ చెరో వికెట్‌ తీశారు. వర్షం కారణంగా నిన్న మ్యాచ్‌ ఆగిపోగా.. ఇవాళ రిజర్వ్‌డే నాడు 46.1 బాల్‌ నుంచి మళ్లీ ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్ది సేపటికే న్యూజిలాండ్‌ 3 వికెట్లు కోల్పోయింది.