స్థిరంగా ట్రేడ‌వుతున్న మార్కెట్‌

స్థిరంగా ట్రేడ‌వుతున్న మార్కెట్‌

అమెరికా చైనా మ‌ధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం కార‌ణంగా నిఫ్టి స్థిరంగా ట్రేడ‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్లు మాత్రం భారీ న‌ష్టాల్లో ఉన్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు, ఇపుడు ఆసియా మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రస్తుతం 20 పాయింట్ల న‌ష్టంతో 11,282 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. టెక్నాల‌జీ షేర్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్ గెయిన్స్‌... జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బ్రిటానియా, ఇండియా బుల్స్ హౌసింగ్‌, రిల‌య‌న్స్‌, అదానీ పోర్ట్స్‌. టాప్ లూజ‌ర్స్‌.... హెచ్‌సీఎల్ టెక్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఐఓసీ.