రూ.1,212కే విమాన టిక్కెట్టు

రూ.1,212కే విమాన టిక్కెట్టు

ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్ కింద రూ.1,212 కే ప్రారంభ విమాన టిక్కెట్టును అందించనుంది. ఈ ప్రత్యేక ఆఫర్ కోసం ఇండిగో సంస్థ 12 లక్షల సీట్లను కేటాయించింది. జులై 13 లోపు ఈ సీట్లను బుకింగ్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకున్న సీట్లను ప్రయాణికులు జూలై 25 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అధికారి విలియమ్ బౌల్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ అంతర్జాతీయ విమానాలతో పాటు దేశీయ విమాన సర్వీసులకు కూడా వర్తించనుంది. అయితే ఆగస్టు 4 నాటికి ఇండిగో సంస్థ విమాన సేవలు ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ఆఫర్ ను  ప్రకటించింది.