దుమ్ము రేపిన ఇండిగో 

దుమ్ము రేపిన ఇండిగో 

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం... ప్రత్యర్థి కంపెనీలకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా ఈ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునక్న ఇండిగో కంపెనీ విశేషంగా లబ్ది పొందింది. మార్చినెలతో ముగిసిన మూడు నెలల కాలంలో ఇండిగో విమానాల యాజమాన్య కంపెనీ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ రికార్డు స్థాయిలో రూ. 589.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం ఏకంగా అయిదు రెట్లు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెని నికర లాభం రూ. 117.60 కోట్లు. కంపెనీ ఆదాయం కూడా 36 శాతం పెరిగి రూ. 788.33 కోట్లకు చేరింది. వాస్తవానికి ఇంధన ధరలు అధికంగా ఉండటం, రూపాయి బలహీనంగా ఉండటం వల్ల కంపెనీపై భారం పెరిగిందని కంపెనీ పేర్కొంది. గత ఏడాది కంపెనీ లాభాల మార్జిన్‌ 19.5 శాతం ఉండగా, ఈ ఏడాది 27.8 శాతానికి పెరిగిందని తెలిపింది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ. 5 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది.