వరద ముప్పుతో ఇండోనేషియా రాజధాని మార్పు..!!

వరద ముప్పుతో ఇండోనేషియా రాజధాని మార్పు..!!

ఇండోనేషియా దేశంలో తరచుగా భూకంపాలు, సునామి, వరదలు వస్తుంటాయి.  దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  అయితే, ఈ ముప్పు ఇండోనేషియాలోని మిగతా ప్రాంతాలకంటే ఆ దేశ రాజధానిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది.  దీంతో ఆ దేశ రాజధానిని మార్చాలని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నిర్ణయం తీసుకున్నాడు.  ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించాడు.  

ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ఈ విషయం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు.  బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు ఇండోనేషియా రాజధానిని తరలించనున్నట్టు అయన తెలిపారు.  ప్రస్తుత రాజధాని జకార్తాలో ప్రతి సంవత్సరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నదని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక భాగం సముద్రంలో మునిగిపోతుందని నిపుణులు హెచ్చరించినట్టు ఆయన తెలిపాడు.  అందుకే రాజధానిని జకార్తా నుంచి కాళీమంథన్ కు మార్చబోతున్నట్టు అయన తెలిపారు.