ఏపీకి భద్రాచలం.. ఇంద్రకరణ్‌ ఏమన్నారంటే..

ఏపీకి భద్రాచలం.. ఇంద్రకరణ్‌ ఏమన్నారంటే..

భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించే ప్రతిపాదనేదీ లేదని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రలూ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో ఖాళీగా వున్న ఏపీ భవనాలను అప్పగించడం అభినందనీయమని అన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించామని ఇంద్రకరణ్‌ చెప్పారు.