కేసీఆర్ బుద్ధి పుట్టినప్పుడే కేబినెట్ భేటీ

 కేసీఆర్ బుద్ధి పుట్టినప్పుడే కేబినెట్ భేటీ

సీఎం కేసీఆర్ చాలా రోజుల తరువాత కేబినెట్ భేటీ నిర్వహించారని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి చురకలంటించారు. కేసీఆర్ బుద్ది పుట్టినప్పుడే మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఎద్దేశా చేశారు. ప్రజలను మభ్యపెడుతు గతంలో తీసుకున్న నిర్ణయాలను పక్కకు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల వాగ్ధానాల్లో కేసీఆర్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చూడటం వల్లే కోర్టు స్టే ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అలాగే ప్రగతి భవన్ నుంచే గ్రామ పంచాయతీ పాలన నిర్వహించాలని అనుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయించారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఈ గ్రామ కార్యదర్శులు ఎక్కడ్నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవస్థ గురించి తాను ఎప్పుడు వినలేదని, గ్రామ పంచాయతీలన్నింటినీ కంట్రోల్‌లో పెట్టుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారా? అని నిలదీశారు. నిన్నటి కేబినెట్ భేటీ కేవలం వారి జేబులు నింపుకోవడానికి మాత్రమే నిర్వహించారని ఇంద్రసేనారెడ్డి అన్నారు.