దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్: మార్చిలో 0.1%కి చేరిన పారిశ్రామికోత్పత్తి

దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్: మార్చిలో 0.1%కి చేరిన పారిశ్రామికోత్పత్తి

ఎన్నికల సమయంలో వెలువడిన పారిశ్రామిక వృద్ధి గణాంకాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి షాకిచ్చాయి. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) జారీ చేసిన గణాంకాల ప్రకారం తయారీ రంగంలో క్షీణత కారణంగా ఈ ఏడాది మార్చిలో పారిశ్రామిక వృద్ధి 0.1 శాతానికి తగ్గింది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, మార్చి 2018లో పారిశ్రామిక వృద్ధి రేటు 5.3 శాతం ఉంది. శుక్రవారం జారీ చేసిన అధికారిక గణాంకాలలో ఈ సమాచారం తెలియజేయడం జరిగింది. 

సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక వృద్ధి రేటు 3.6 శాతం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇది 4.4 శాతంగా ఉంది. ఉత్పత్తి, మైనింగ్, విద్యుత్ వంటి కీలక పరిశ్రమల పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామిక వృద్ధిని లెక్కగడతారు. ఫిబ్రవరిలో కూడా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 20 నెలల కనిష్ట స్థాయిలో 0.10 శాతం మాత్రమే ఉంది.