తగ్గుతోన్న పసిడి అమ్మకాలు..! ధరల పరిస్థితి ఏంటి..?

తగ్గుతోన్న పసిడి అమ్మకాలు..! ధరల పరిస్థితి ఏంటి..?

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. సెప్టెంబర్‌లో బంగారం ధరతో పోలిస్తే.. ఇప్పుడు చాలా వరకు తగ్గడం కూడా ఊరటనిచ్చే అంశం.. ఇక, ఈ దీపావళికి పసిడి అమ్మకాలు 30 శాతం మేర తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో తులం బంగారం ధర రూ.40 వేలకు చేరినా, తర్వాత దిగొచ్చింది. ప్రస్తుతం రూ.38 వేల నుండి రూ. 39 వేల మధ్యలో కదలాడుతోంది. అయితే కొనుగోలుదార్ల సెంటిమెంటు బలహీనంగా ఉండటం, 2018 ఇదే సమయంతో పోలిస్తే, ధర ఎక్కువగా ఉన్నందున, ఈసారి అమ్మకాలు 30 శాతం తగ్గొచ్చన్నది పరిశ్రమ అంచనాగా తెలుస్తోంది. దీనికితోడు ఆర్థిక మందగమనం కూడా తోడు కావడంతో ఈ సారి బంగారు ఆభరణాల విక్రయాలు అంతంతమాత్రంగా ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు... అయితే, పెళ్లిళ్ల సీజన్ మొదలైతే అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.